కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.