వర్షంలో, సైకిల్ పైన కోవిడ్ బాధితుల‌కు ఎమ్మెల్యే ప‌రామ‌ర్శ‌

శనివారం, 3 జులై 2021 (20:59 IST)
వ‌ర్షం వ‌స్తే, ప్ర‌జాప్ర‌తినిధికి గొడుగు ప‌ట్టే వాళ్ళు చాలా మంది, మార్బ‌లం ఉంటాయి. అస‌లు ఎమ్మెల్యేకు వాన‌లో త‌డ‌వాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? కానీ, ఈ ఎమ్మెల్యే అలాకాదు. కోవిడ్ బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆయ‌న 45 రోజులుగా సైక‌ల్ యాత్ర చేస్తున్నారు.

ఇంటింటికీ సైక‌ల్ పై వెళ్లి, ఎలా ఉన్నారు?  జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ ప‌ల‌క‌రిస్తున్నారు. 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరు వానలో కూడా సైకిల్ దిగ‌కుండా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న ప‌రామ‌ర్శ యాత్ర‌ను కొనసాగిస్తున్నారు.

ఈ శ‌నివారంతో ఆయన సైకిల్ పర్యటన 45వ రోజుకు చేరింది. యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తున్నారు. వ‌ర్షం వ‌స్తున్నా లెక్క చేయ‌కుండా సైకిల్ తొక్కుకుంటూ, గ‌డ‌ప గ‌డ‌పా సంద‌ర్శిస్తున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కోవిడ్ పేషంట్స్‌ను పరామర్శిస్తూ, వారికి ధైర్యం చెప్ప‌డమే కాకుండా, ఉచితంగా నిత్యావసరాలు, పౌష్టికాహారం అందిస్తున్నారు. వ‌ర్షం వ‌స్తుంటే, హాయిగా, వెచ్చ‌గా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసే ప్ర‌జాప్ర‌తినిధులున్న ఈ రోజుల్లో... ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు సైకిల్ యాత్ర‌ను చూసి, ప్ర‌జ‌లు వాహ్... ఎమ్మెల్యే ప‌నితీరు! అని మెచ్చుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు