చంపేస్తా అని పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోనే ర‌ఘురామ‌కు హెచ్చ‌రిక, ఎవరు?

మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:00 IST)
అక్క‌డా, ఇక్క‌డా చాటుగా కాదు... ఏకంగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనే చంపేస్తాన‌ని బెదిరించార‌ట‌. అదీ వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణం రాజును. బెదిరించింది ఎవ‌రో కాదు... ఆ పార్టీకే చెంద‌ని మ‌రో ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అంట.

ఈ మేర‌కు ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.  పార్లమెంట్‌ ఆవరణలో రఘురామను మాధవ్‌ దుర్భాషలాడార‌ట‌.

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే, అంతం చేస్తామని రఘురామను మాధవ్‌ బెదిరించార‌ట‌. దీంతో ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లోక్ స‌భ స్పీక‌ర్‌కి  విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు