జార్ఖండ్ ఎన్నికలు : అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

సోమవారం, 23 డిశెంబరు 2019 (11:30 IST)
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అదేసమయంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 
 
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి ఏకంగా 45 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు కావాల్సి వుంది. అలాగే, బీజేపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, జేవీఎం 3, ఏజేఎన్ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
జంషెడ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉన్నారు. దుంకా, బహెరెట్ హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరేన్‌ను కాంగరెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. అలాగే, అదివాసీల ఫార్ములా కూడా ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసిరావడంతో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు