ఆకాశమంతా గులాబీ రంగులోకి మారిపోయింది.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 22 జులై 2022 (14:36 IST)
Pink Sky
ఆకాశమంతా గులాబీ రంగులోకి మారిపోయింది. మీరు చదువుతున్నది నిజమే. బుధవారం సాయంత్రం ఆకాశం గులాబీ రంగులోకి మారింది. సోషల్ మీడియాలో దట్టమైన మేఘంతో కూడిన ఫొటోలు వైరల్ అయ్యాయి. నేల మీద నుంచి పింక్ లైట్ ఆకాశంలోకి పడుతున్నట్లుగా కనిపించడంతో స్థానికులంతా ఏలియన్లని భ్రమపడ్డారు.
 
వాళ్లే కాదు.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసిన వారంతా ఏదో వింత జరుగుతుందన్నట్లుగా భావించారు. కొందరు ధైర్యం చేసి ఆ ప్రదేశ సమీపానికి వెళ్లి చూసి దానిపై క్లారిటీ ఇచ్చారు.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీకి చెందిన గంజాయి తోట నుంచి ఆ పింక్ మెరుపు వస్తుందట. మరుసటి రోజు కూడా కాస్త అటువంటి కాంతే కనిపించిందని ఫోటోలు పెట్టి ప్రూవ్ చేశారు. దీనిని ఆ ఫార్మాసూటికల్ కంపెనీ కూడా కన్ఫామ్ చేసింది. 
 
మొక్కల ఎదుగుదలలో భాగంగా పలు రకాల కాంతులు ఉన్న లైట్ వెలిగిస్తుంటామని చెప్పారు. అవి పువ్వుల దశలో ఉన్నప్పుడు రెడ్ లైట్ తరచుగా వాడుతుంటామని పేర్కొన్నారు.
 
"దీని కోసం ఎల్ఈడీ లైట్లు వాడుతుంటాం. రెగ్యులర్‌గా సూర్యాస్తమయానికి వాటిని ఆఫ్ చేస్తాం. కానీ, వాటిని పరీక్షిస్తుండటంతో ఆ రెండ్రోజులు లైట్‌ను కాస్త లేట్‌గా ఆఫ్ చేశాం. మొక్కలు నిద్రపోయేసమయానికి లైట్లు ఆర్పేశాం" అని ఆ యాజమాన్యం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు