వ్యక్తికి వ్యక్తికీ మధ్య సామాజిక దూరం (సోషల్ డిస్టేన్స్) పాటిస్తే కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చని డాక్లరు, నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది పౌరులు వీరి సూచనలు బేఖాతర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని జంతువులు, పక్షులు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే అవి సామాజికి దూరాన్ని పాటిస్తున్నాయి. ఇటీవల రోడ్డును దాటుకునే సమయంలో ఏనుగులు దూరం దూరంగా నడుస్తూ వెళ్లాయి.
ఇపుడు కొన్ని నెమళ్లు కూడా ఇదే విధంగా నడుచుకున్నాయి. సామాజిక దూరం పాటించడం అంటే ఇట్లా... అంటూ చెప్తున్నట్లుగా ఉన్న ఓ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని నగౌర్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వరండాలో నెమళ్లు ఒకదానికొకటి దూరం పాటిస్తూ... క్రమశిక్షణతో పడుకున్న ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ షేర్ చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెమళ్లకు ఉన్న జ్ఞానం, తెలివి మన పౌరులకు లేదని, వీటిని చూసైనా ప్రజలు తెలుసుకోవాలంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.