వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అల్పన, సచిన్ భార్యభర్తలు. సచిన్ సైన్యంలో పనిచేస్తుండడంతో అల్పన.. అత్త సుబోధ్ దేవితో కలిసి ఉంటోంది. సుబోధ్ దేవి భర్త రాజేశ్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు.
ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన మనీష్ అనే వ్యక్తితో అల్పనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు మితిమీరడంతో గమనించిన సుబోధ్ దేవి కోడల్ని మందలించింది. దీంతో అత్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది కోడలు. ప్రియుడు మనీష్‌తో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పాముతో కాటు వేయించి అత్తను హత్య చేసింది. గతేడాది జూన్ 2న ఈ ఘటన జరిగింది.
సుబోధ్ దేవి మరణించిన నెలన్నర తర్వాత అల్పన ప్రవర్తనను చూసి సుబోధ్ దేవి బంధువులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టి.. నిందితురాలు అల్పనను అరెస్ట్ చేశారు. ఆపై అల్పన, మనీష్, కృష్ణ కుమార్‌లను రిమాండ్‌కు తరలించారు.