తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని సర్వే నివేదికను ప్రచురించడం సంచలనం రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని సర్వే తేల్చేసింది.
రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించి.. చాలారోజులైనా.. ఇప్పటిదాకా పార్టీ పేరు, విధానాలను సూపర్ స్టార్ వెల్లడించలేదు. అయితే రజనీకాంత్ నటించిన కాలా సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.