ఈ మేరకు తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తన దృష్టికి కూడా వచ్చిందని, ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు తన నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారంటూ మమత చెప్పుకొచ్చారు. కానీ తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కుట్రల నుంచి తాను ప్రాణాలతో బయపడ్డానన్నారు.
ఇదిలా ఉంటే.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మార్చిలో భేటీ అయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చించిన సంగతి తెలిసిందే. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని మమతను కేసీఆర్ కోరినట్లు సమాచారం.
మరోవైపు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.