శాసనసభ సభ్యత్వానికి కొండా మురళి రాజీనామా

శనివారం, 22 డిశెంబరు 2018 (12:14 IST)
శాసనసభ సభ్యత్వానికి కొండా మురళి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర శాసనసమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌కు శనివారం అందజేశారు. 
 
గత 2015లో స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ తరపున ఎన్నికైన కొండా మురళి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెరాస చేసిన ఫిర్యాదుతో వివరణ ఇవ్వాల్సిందిగా వారికి మండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. 
 
దీంతో స్వామిగౌడ్‌తో సమావేశమైన అయిన కొండా మురళి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. తమకు పదవుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో వైకాపా అధినేత జగన్ కోసం తన భార్య కొండా సురేఖ మంత్రిపదవిని కూడా వదులుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు