ప్రమాదకరమైన బైక్ స్టంట్స్.. సూరత్‌లో యువతి అరెస్ట్ (video)

బుధవారం, 10 మార్చి 2021 (16:31 IST)
Heavy stunts
సూరత్‌లోని రద్దీ వీధుల్లో ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేస్తున్న యువతిని సూరత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెల్మెట్, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా బైక్ స్టంట్ చేసిన తర్వాత సదరు యువతి తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. 
 
ఆ యువతి పేరు సంజన. ఇలా ఆమె చేసిన స్టంట్స్ వీడియోతో వైరల్ అయిన తరువాత, పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ విన్యాసాలు చేయడం, ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు. ప్రాణాలను లెక్క చేయకుండా ఆమె చేసిన స్టంట్స్ ప్రస్తుత అయ్యబాబోయ్ అనిపిస్తున్నాయి. 
 
సంజన అనే యువతి బైక్ స్టంట్ వీడియో వెలువడిన తరువాత, పోలీసులు రంగలోకి వచ్చారు. ఆ తర్వాత ఆమె బైక్ సంఖ్య కనుగొనబడింది. ఈ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు బైక్ యజమాని వద్దకు వచ్చారు. మోడలింగ్, ఫోటోగ్రఫీ కోసం సంజన బైక్‌ను ఉపయోగించారని బైక్ యజమాని పోలీసులకు చెప్పింది.
 
బర్డోలిలో నివసించే సంజన, సూరత్‌కు బైక్‌పై స్టంట్స్ వీడియోలను అప్ లోడ్ చేసింది. సంజనపై కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సంజన తన బైక్ స్టంట్స్‌కు సంబంధించిన పలు వీడియోలను షేర్ చేసింది. దీనికి పెద్ద సంఖ్యలో లైక్‌లు కూడా ఉన్నాయి.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by _SANJU_ (@princi_sanju_99)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు