ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నేతల మధ్య వాడీవేడీగా చర్చ సాగుతోంది. సాధారణంగా జగన్, ఇతర వైసీపీ నేతలపై చాలా దూకుడుగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌పై కూడా విజయసాయి ఘాటుగా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. అయితే దీని వెనుక ఓ త్రోబాక్ స్టోరీ ఉందని తేలింది.