చాలా మంది ఇంట్లో బీరువాను ఏ వైపు పెట్టుకోవాలన్న అంశంపై తర్జన భర్జనలు చెందుతుంటారు. ఎందుకంటే అత్యంత విలువైన ఆభరణాలను ఇందులో నిల్వ చేస్తుంటారు కాబట్టి.
ఇదే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. బీరువాల అవసరం అనేక విధాలుగా వుంటుంది. డబ్బులు, ఆభరణాలు, డాక్యుమెంట్లు మొదలైన విలువైన వస్తువులు దాచడానికి, వాడుకోవడం లేదా బట్టలు పెట్టుకోవడం వగైరా... విలువైన ధన సంబంద బీరువాను నైరుతి గదిలో దక్షిణ నైరుతికి చేర్చి ఓపేన్ చేస్తే ఉత్తరం ముఖం చూసేలా పెట్టాలని సలహా ఇస్తున్నారు.
ఇది వీలు పడనపుడు పడమర నైరుతి చేర్చి తూర్పు వైపు తెరుచుకునేలా బీరువా పెట్టుకోవచ్చని సూచన చేస్తున్నారు. అదేసమయంలో పడక గది విశాలత, ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఈ బీరువా ఉండరాదని వారు సలహా ఇస్తున్నారు.