"ఈశాన్యం" ఎంత పెరిగితే అంత మంచిది

గృహనిర్మాణంలో ఈశాన్య మూలకు విశేష ప్రాముఖ్యం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని.. ఈ మూల పెరిగడం ద్వారా శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారికి సకలసంపదలు, విద్య, వినోద పాండిత్యాలు చేకూరుతాయి.

గృహనిర్మాణంలో ఇటు.. తూర్పుతో కలిసిగానీ, అటు ఉత్తరంతో కలిసిగానీ ఈశాన్య దిశ పెరిగితే శుభప్రదమని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే ఈశాన్య మూల స్థలం తగ్గితే అరిష్టం. ఈశాన్యం దిశ పవిత్రమైన దిశగా వాస్తు పేర్కొంటోంది. అందుకే ప్రధాన గృహానికి ఈశాన్య భాగంలో పూజగదిని నిర్మించడం సంప్రదాయం.

ఇంకా చెప్పాలంటే... ఈశాన్య మూలను పూర్తిగా మూసివేసినట్టు గదులుగాని, శాలలు గానీ ఏవిధమైన కట్టడాలు నిర్మించకూడదు. ఈశాన్యంలో మరుగుదొడ్ల ఏర్పాటు అసలు కూడదు. అంతేగాకుండా చెట్లు, పూలమొక్కలు గానీ ఈశాన్యదిశలో వేయకూడదు.

ఇంట్లోని ప్రతిగదికి ఈశాన్య దిశ పల్లంగా ఉండటం మంచిదని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఈశాన్యంలో బావి ఉండటం శ్రేయస్కరం. గృహావరణలోని నీరు ఈశాన్యం నుంచి బయటికి పోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి