అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనడం వల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వేదకాలంలో ఋషులు అక్షయ తృతీయ నాడు యజ్ఞయాగాదులు, పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందారు. అందుకే అక్షయ తృతీయ రోజున వీలైనంత పూజలు, దానధర్మాలు చేయడం.. సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
పశువులకు ఆహారాన్ని అందించడం వల్ల జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. బంగారం, వెండిని కొనుగోలు చేయడం కూడా ఉత్తమం. అలాగే బంగారం కొనడం కంటే ఉప్పు లేదా పసుపును కొనుగోలు చేస్తే, ప్రయోజనం బంగారం కొనడం కంటే ఎక్కువని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.