సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజామందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు,కుంకుమ,పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి.
పూజ మందిరంలో రంగవల్లికలు వేసి దానిపై ఓ పీఠను ఉంచి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకులో బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. ఈ కలశానికి నూలును చుట్టడం, మామిడి ఆకులను వుంచడం, కలశపు నీటిలో పచ్చకర్పూరం, ఒక లవంగం, ఒక యాలక్కాయను వేయాలి.