ఆకలేయట్లేదా? క్యారెట్ పచ్చడి టేస్ట్ చేసి చూడండి....

సోమవారం, 2 జులై 2018 (14:56 IST)
క్యారెట్‌ తింటే విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అలాగే జీవితాంతం అద్దాలు పెట్టుకోకుండా ఉండాలంటే వారానికి ఐదారు క్యారెట్లు తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించాలంటే క్యారెట్‌ను తీసుకోవాల్సిందే. అంటువ్యాధులు, అలెర్జీలను అడ్డుకునేందుకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో క్యారెట్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కడుపులో ఆమ్లాలు చేరడం ద్వారా ఏర్పడే తేపులు, పిత్త వ్యాధులు, ఆకలి లేమిని దూరం చేసుకోవాలంటే క్యారెట్ తురుముతో పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
క్యారెట్లు - అరకేజీ 
కొబ్బరి తురుము - 2 కప్పులు 
నిమ్మరసం - పావు కప్పు 
మిరియాలు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
పచ్చిమిర్చి - 10
కొత్తిమీర - 1కట్ట
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కావలసినంత
 
తయారీ విధానం :
ముందుగా క్యారెట్ తురుమును ప్యాన్‌పై లేతగా వేపుకోవాలి. అందులో కొబ్బరి తురుము, కొత్తిమీర, మిరియాలు, పచ్చిమిర్చి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేయాలి. తరువాత వెంటనే అందులో ముద్దుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న ముద్దను చేర్చి దించేయాలి. అంతే క్యారెట్ పచ్చడి రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు