అమ్మాయి.. అబ్బాయి సెక్స్ చేస్తున్నారా.. అయితే మీరు చూడొద్దు!!
గురువారం, 4 ఏప్రియల్ 2013 (13:04 IST)
File
FILE
ఒక అమ్మాయి అబ్బాయి లేదా స్త్రీ పురుషుడు పరస్పర ఆమోదంతో రతి క్రీడలో పాల్గొని ఉండటాన్ని ఎవరైనా చూస్తే.. అలాంటి వారు నేరానికి పాల్పడినట్టే. ఈ విధంగా పదేపదే పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసేస్తారు. ఈ తరహా కఠిన నిబంధనలను తాజాగా అమలుకు వచ్చిన అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నాయి.
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగి వేధింపులకు అడ్డుకట్ట వేయడమే, ఈ తరహా నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా ఈ అత్యాచార చట్టాన్ని రూపొందించగా, దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. దీంతో ఇది బుధవారం నుంచి అమలుకు వచ్చింది.
ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనల మేరకు.. రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష. నేరం కఠినంగా ఉంటే చనిపోయేంత వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. గతంలో ఈ నేరాల్లో దోషిగా తేలి, మళ్లీ అలాంటి వాటికి పాల్పడితే మరణశిక్షను అమలు చేస్తారు.
అలాగే, ఇతరులు శృంగారంలో పాల్గొంటున్నప్పుడు దొంగచాటుగా చూసే నేరాలకు తొలిసారి పాల్పడితే బెయిలు. పదేపదే పాల్పడితే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. మహిళలను వెంటబడి వేధించడం (స్టాకింగ్), యాసిడ్ దాడి దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించేలా చట్టంలో నిబంధన ఉంది.
అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులకు అన్ని ఆస్పత్రులూ తప్పనిసరిగా చికిత్స అందించాలి. అందుకు నిరాకరిస్తే.. జైలు శిక్ష విధిస్తారు. . పోలీసు అధికారులు, ప్రజాసేవకులు, సాయుధ బలగాల సిబ్బంది, ఆస్పత్రుల సిబ్బంది.. మహిళలపై తీవ్ర నేరాలకు పాల్పడితే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవసరమైతే యావజ్జీవం జైలుశిక్షను కూడా అమలు చేస్తారు.
రేప్ బాధితురాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక, శారీరకంగా వికలాంగురాలైతే ఆమె వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అనుసంధానకర్త సాయంతో నమోదు చేయించడానికి అనుమతి. వాంగ్మూల ప్రక్రియను వీడియో చిత్రీకరించేందుకు వీలు కల్పించే వెసులుబాటు వంటి అనేక కఠినతరమైన నిబంధనలు ఇందులో ఉన్నాయి.