కదలకుండా కూర్చున్నారో.. వీపుపై మొటిమలు తప్పవు..

గురువారం, 17 మే 2018 (12:26 IST)
కదలకుండా కుర్చీలకు అతుక్కుపోతున్నారా..? అయితే వీపుపై మొటిమలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీపు గంటల పాటు కుర్చీలకు ఆనించి వుంచితే.. వీపుపై మొటిమలు, దద్దుర్లు ఏర్పడుతాయి. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు వీపును కుర్చీకి ఆనించడానికి విరామం ఇవ్వాలి.


అలాగే సమతుల ఆహారం తీసుకోవాలి. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా చర్మ సమస్యలను దూరంగా వుంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ప్రోటీన్లు వున్న ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. 
 
జుట్టు ఎక్కువగా వుంటే జుట్టు ముందు వైపునకు వేసుకుంటే మంచిది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా పైకి ముడిలా వేసుకోడానికి ప్రయత్నించాలి. ఒకవేళ వీపు మీద మొటిమలు ఏర్పడితే.. ఐస్ ముక్కను తీసుకుని ఆ ప్రాంతంలో తరచూ రుద్దుతూ వుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరినూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. 
 
రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే ఫలితం వుంటుంది. అలాగే తేనెను మొటిమలున్న ప్రాంతంలో రాసుకుని అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు