గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి అమ్మాయిల చేతులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. చేతులకి గాజుల అందం చెంపకు సిగ్గులందము అన్నాడో మహాకవి. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం అని అనుకోవడం పొరపాటు. గాజులు స్త్రీకి రక్షాకం కణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
అంతేకాదు గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటుంది. మణికట్టు నాడుల స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. అందుకే గర్భిణులకు నిండుగా గాజులు వేసి అలంకరిస్తారు. గాజుల శబ్ధం గర్భస్థ శిశువు చెవులకు ఇంపుగా వినిపిస్తాయని తద్వారా శిశువుకు శబ్ధాన్ని గ్రహించే శక్తి పెంపొందుతుందని వైద్యులు అంటున్నారు.