పెరుగు త్వరగా పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి ముక్కలను వేసుకుంటే మంచిది. పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా లేదా నూనెను వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. నిమ్మకాయ తొక్కలను పిండిన తరువాత వాటిని కుక్కర్ క్రింద వేస్తే దానిలో నుండి వెలువడే వాసన తొలగిపోతుంది. పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే చాలా రోజుకు పాడవకుండా ఉంటాయి.
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నె అంచుకు నూనెను రాయాలి. అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడిగితే శుభ్రంగా ఉంటాయి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్ పాలు ఆ ముక్కలలో వేయాలి. పసుపు నీటితో కిచెన్‌ను శుభ్రంచేస్తే దోమలు రావు. బిస్కెట్ ప్యాకెట్‌లను బియ్యం డబ్బాలో ఉంచడం వలన తొందరగా మెత్తబడవు.