ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. 9 గంటలకు 9.05 శాతం

ఠాగూర్

సోమవారం, 13 మే 2024 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 9 గంటలకే 9.05 శాతం మేరకు పోలింగ్ జరిగింది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు 175 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది. అలాగే, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైంది. 
 
ఏపీలో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09 శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13.22 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్‌ నమోదైంది.
 
తొలి రెండు గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9.21 శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రముఖ శాసనసభ నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉదయం 9 గంటల వరకు కుప్పంలో 9.72 శాతం ఓటింగ్‌ నమోదైంది. మంగళగిరిలో 5.25 శాతం, పిఠాపురంలో 10.02 శాతం, పులివెందుల 12.44 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు