బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మరోమారు వార్తలకెక్కింది. దక్షిణాది సినీ ప్రేక్షకులు తనకు గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన కామెంట్స్ చూసిన నెటిజన్లు ఫక్కున నవ్వుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య', బాలకృష్ణతో 'డాకు మహారాజ్' వంటి చిత్రాల్లో నటించి ఒక్కసారిగా తెలుగులో సైతం బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె విచిత్రంగా వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఉత్తరాదిలో తన పేరు మీద ఓ ఆలయం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని కూడా సందర్శించండి. ఢిల్లీ యూనవర్శిటిలోనూ నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను దండమమాయి అని పిలుస్తుంటారు. నేను ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇది నిజం. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. మీరంతా వాటిని చూడొచ్చు.
అలాగే, టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లతో కలిసి నటించాను. అక్కడ కూడా నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా నాకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.