గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా
గురువారం, 22 సెప్టెంబరు 2011 (12:19 IST)
కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29వ తేదికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పిటిషన్ వాయిదా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సకల జనుల సమ్మె కారణంగా కోర్టుకు న్యాయవాదులు ఎవరూ రాక పోవడంతో గాలి పిటిషన్ వాయిదా పడినట్లు సమాచారం
సకలజనులసమ్మె కొనసాగుతున్నందున కోర్టుకు న్యాయవాదులు హాజరు కాలేదు. గాలి తరఫు న్యాయవాదులు సైతం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయన పిటిషన్ 29కు వాయిదా వేసింది.
కాగా గాలి, శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. గాలికి బెయిలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని తన కౌంటర్ ఫైల్లో పేర్కొంది. బెదిరింపుల ద్వారానో మరో రూపంలోనో సాక్ష్యులను సైతం ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ పేర్కొంది.