జగన్ పార్టీ వాళ్లు 420 గాళ్లు... ఎన్టీఆర్ ఫోటోలు వాడుకుంటున్నారు....
WD
నిన్నటివరకూ విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో లొల్లి సాగితే తాజాగా విశాఖపట్టణంలో బాద్ షా రూపంలో మరోసారి జగన్ ఫోటోతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు ఫైర్ అయ్యారు.
జగన్ పార్టీ వాళ్లు 420 గాళ్లనీ, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేమన్న భయంతోనే ఇలా తమ నాయకుల ఫోటోలను వారి పార్టీ ప్లెక్సీల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. దమ్ములేని ఇలాంటి చీప్ ట్రిక్కులకు ప్రజలు మోసపోరనీ, తగురీతిలో బుద్ధి చెపుతారని అన్నారు.
తమ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కరెంటు కష్టాలపై దీక్షలు చేస్తుంటే, వీళ్లు నందమూరి కుటుంబం ఫోటోలను వేసుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.