ముఖ్యంగా మహేష్ బాబు అద్భుతమైన నటన, ఆ డిక్షన్, డైలాగ్ డెలివరీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైలాగ్స్ అలరిస్తాయి. మణిశర్మ అందించిన సాంగ్స్, బీజీఎంతో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. రీరిలీజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేకమైన రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 స్క్రీన్‌లలో రీ-రిలీజ్ అవుతుంది. రీ-రిలీజ్‌లలో చిత్రాలలో ఈ స్థాయిలో స్క్రీనింగ్ లలో విడుదల అవడంలో రికార్డు సృష్టించింది.
అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు సృష్టిస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే 100 కే పైగా టికెట్లు బుక్ అయ్యాయి అంటేనే సినిమాకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఖలేజా రీ-రిలీజ్ ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఒక పండగ లాంటిది. వెండితెరపై ఆయన్ను చూడాలి అనుకున్న అభిమానులకు ఇదో సువర్ణ అవకాశం కూడా. అందుకే ఖలేజా రీరిలీజ్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి అభిమానులు సిద్దం అయ్యారు.
నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, షఫీ తదితరులు