తెలంగాణ వాదులను కాల్చిచంపిన కాసు : విగ్రహం ధ్వంసం!

సోమవారం, 17 సెప్టెంబరు 2012 (09:34 IST)
File
FILE
దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డిపై తెలంగాణవాదుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. దీంతో హైదరాబాద్‌ నడిబొడ్డు ప్రాంతమైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని తెలంగాణవాదులు ఆదివారం రాత్రి ధ్వసం చేశారు. తెలంగాణ విలీన, విద్రోహ దినోత్సవాని సెప్టెంబరు 17వ తేదీ సోమవారం నిర్వహించే సమాయనికి కొన్ని గంటలకు ముందు కాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం గమనార్హం.

కాగా, కాసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1967-68, 71 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేర్లలో పారించి 370 మంది తెలంగాణ ఉద్యమకారుల చావులకు కారకుడయ్యాడన్న అపవాదు ఇప్పటికీ ఉంది. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహం గుర్తు తెలియని తెలంగాణ వాదుల చేతిలో ధ్వంసమైందని భావిస్తున్నారు. దీనిపై ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి