బాబు లేఖ ఇస్తే తెలంగాణ తెచ్చే బాధ్యత మాది: పొన్నం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ తెస్తే కొత్త రాష్ట్రాన్ని తెచ్చే బాధ్యత తమదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరహా లేఖ ఇవ్వడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు.

ఇకపోతే.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆజాద్, చిదంబరం ప్రకటనలపై స్పందించమంటున్న తెదేపా నేతలు చిత్తశుద్ధి ఉంటే చిదంబరానికి తమ అభిప్రాయాలు తెలపాలని పొన్నం సవాల్ విసిరారు.

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాము చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేయడం లేదన్నారు. తమ రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి