వై.ఎస్. జగన్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందే..!: కొండా మురళి

FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. జగన్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అవుతుందన్న సురేఖ మాటల్లో ఎలాంటి తప్పూ లేదని మురళీ వెల్లడించారు.

జగన్‌కు అనుకూలంగా మాట్లాడిన వారికి నోటీసులు ఇస్తూ పోతే చివరికి ఎవరూ మిగలరని మురళీ అన్నారు. ఇలా ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తారని మురళి ప్రశ్నించారు. ఎన్ని షోకాజ్‌లు ఇచ్చినా తామంతా జగన్ వెంటే ఉంటామన్నారు.

మాజీమంత్రి కొండ సురేఖ దంపతులు శనివారం డీజీపీ అరవింద్‌కుమార్‌ను కలిశారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ తమకు గన్‌మెన్‌ల సంఖ్యను పెంచాలని డీజీపీని కోరామన్నారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓదార్పు యాత్ర జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతమని అధిష్టానమే చెప్పిందని మురళీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి