దేశంలోని ప్రతి గ్రామంలోనూ విదేశీ వస్త్రాలను రోడ్లపైన వేసి తగలబెట్టిన సందర్భంగా బ్రిటీష్ ప్రభుత్వంపోలీసులను పంపి మగవారిని చిత్రహింసలు చేసి ఆడవారిని వివస్త్రాలను చేసి చిత్రహింసలకు గురిచేసినప్పటికీ మొక్కవోని దీక్షతో ఎదురుతిరిగి స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక మలుపు తిప్పిన చరిత్ర చేనేతకు వుందని అటువంటి చేనేత ను కాపాడుకోవలసిన అవసరం ప్రతి భారతీయుడు పైన వుందని అన్నారు.
ఈ చేనేత దినోత్సవం సందర్భంగానైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల రక్షణ కోసం వున్నామని ఒట్టి మాటలు కాకుండా పరిష్కారం దిశగా అడుగులు వేయడం ద్వారా చేనేతకు రక్షణ కల్పిచాలని కరోనా కష్టకాలంలో పనులులేక అర్ధాకలితో ఒకవైపు ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమబడ్జెట్లో కేవలం రూ.200 వందల కోట్లు కేటాయించటం చాలా దారుణమన్నారు.
2021లో పట్టు 3 వేల రూపాయలు వుంటే ఈ రోజు 8 వేల రూపాయలు వుందన్నారు. అలాగే కాటన్ నూలు ధరలు పెరిగినట్టు తెలిపారు. ఇవి చాలదన్నట్లు బ్రిటీష్ కాలంలో కూడా చేనేతకు పన్ను లేదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్టికల్ 43లో గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితాలో స్థానం కల్పించి చేనేత కు పన్ను లేకుండా ఆనాడు ప్రభుత్వాలు చేశాయని, కానీ, చేనేతను ఉద్ధరిస్తాం, రక్షణగా వుంటామని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత చేనేతపై పన్నులు వేయటం దుర్మార్గం అన్నారు.