ప్రముఖ సినీ నటి సమంత శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆమె బ్యానర్‌లో నిర్మిస్తున్న శుభం చిత్రం బృందంతో కలిసి ఆమె దర్శనంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం, సమంత, శుభం చిత్ర యూనిట్ సభ్యులు వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఈ బృందానికి స్వాగతం పలికి, వారి సందర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సమంత, చిత్ర బృందానికి వేద పండితులు ఆశీస్సులు అందించారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానికి ముందు, సమంత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తన డిక్లరేషన్‌ను సమర్పించింది.
గత ఏడాది సమంత త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. శుభం ఈ బ్యానర్‌పై నిర్మించబడుతోంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.