“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.