ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం సత్యం బాబు నిందితుడని అతడిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే తాజాగా ఆయేషా తల్లి షంషాద్ బేగం సంచలనాత్మక విషయాలు చెప్పారు.
హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే నిమిషాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థినీవిద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లను విచారిస్తే అంతా బయటకు వస్తుందన్నారు. తమ కుమార్తె ఆయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే వారు ఆమెను పొట్టనబెట్టుకున్నారంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కేసును తిరిగి దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఆమె అభ్యర్థించారు.