ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

ఐవీఆర్

శనివారం, 8 ఫిబ్రవరి 2025 (17:02 IST)
ఇప్పుడు వాస్తవం లేని గాలి వార్తలు రాస్తుంటే నెటిజన్లు చూస్తూ కూర్చోవడంలేదు. కర్రు కాల్చి రాసేవారికి వాత పెడుతున్నారు. ఈమధ్య టాలీవుడ్ సీనియర్ నటి అనుష్క శెట్టి పెళ్లిపై రకరకాల వార్తలు పుట్టిస్తున్నారు. కొందరైతే అనుష్క శెట్టి ఖచ్చితంగా ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందంటూ ఆమధ్య పుకార్లు పుట్టించారు. దీనిపై ప్రభాస్-అనుష్క క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్త అంతటితో సమసిపోయింది.
 
మళ్లీ కొన్నిరోజుల తర్వాత అనుష్క ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తమ్ముడిని వివాహం చేసుకోబోతోందంటూ ప్రచారం చేసారు. ఐతే ఇవన్నీ గాలి వార్తలు అంటూ అనుష్క కొట్టివేయడంతో దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. అనుష్క శెట్టి ప్రముఖ క్రికెటర్ ను పెళ్లాడేందుకు సిద్ధమైందనీ, ఆమె నిశ్చితార్థానికి కూడా ముహూర్తం ఖరారయ్యిందంటూ వార్త రాసారు.
 
ఈ వార్తను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రికెట్ ఎవరో చెప్పకుండా ఈ పనికిమాలిన వార్త ఎందుకురా అంటూ రాసినవారిపై విరుచుకుపడ్డాడు. ఏం దరీదోప తోయని గాలిరాయుళ్లు ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తూ తమ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు