టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ. లక్ష సాయం అందజేశామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవని అవేవి ఇప్పుడు అందడం లేదని ఆరోపించారు. ఆప్కో ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ఆ సబ్సీడీలు లేవు మార్కెటింగ్ లేదు. చివరికి స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూంకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.