రాజధాని అమరావతి రైతులతో చర్చల ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేవలం 20 గ్రామాలకు, ఓ సామాజిక వర్గానికి రాష్ట్ర భవిష్యత్తుని పరిమితం చేయాలా? అంటూ ప్రశ్నించారు. బొత్స చేసిన వ్యాఖ్యలపై అమరావతి దళిత జేఏసీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి తర్వాత దహనం చేశారు.
బొత్స సత్యనారాయణ కేవలం తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి, సీఎం జగన్మోహన్రెడ్డి మెప్పు పొందడానికి రాజధాని ప్రాంత రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.