ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. వివక్షతో కూడా ఈ చర్యలను సహించేది లేదని తెలిపారు. దర్యాప్తు అనంతరం సదరు సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. "ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అని ట్వీట్ చేశారు.