అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేయాలి: కృష్ణాజిల్లా కలెక్టర్

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:18 IST)
విజ‌య‌వాడ‌ నగరంలోని స్వరాజ్య మైదానంలో భారతరత్న డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం పనులు మరింత వేగవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక స్వరాజ్య మైదానాన్ని సందర్శించి అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు.

సుమారు 20 ఏకరాల విస్తీరణంలో రూ.249 కోట్లతో డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షణకు సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజన్సీగా నియమించింది. ఏపీఐఐఎస్ సి కూడా పనుల నిర్వహణతో కూడా భాగస్వామ్యం చేశారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం నాటికి స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, స్మృతివనం, అధ్యయన కేంద్రాలు వంటివి ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా ఆ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు.

అందుకు అవసరమైన కార్యచరణ అమలు చేయాలన్నారు. స్మృతివనం ఏర్పాటుకు ఇప్పటికే స్వరాజ్య మైదానంలో ఉన్న వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను తరలించడం జరిగిందన్నారు. ఇప్పటికే శిధిలావస్థ, నిరుపయోగంలో ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ ను తొలగించడం జరిగిందని అయితే ఖాళీ అయిన మిగిలిన భవనాలను కూడా త్వరితగతిన తొలగించి స్మృతివనం పనులను వేగవంతం చేయాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు