విశాఖపట్టణం రామకృష్ణ బీచ్ (ఆర్కేబీచ్)లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మొహరించివున్నారు. దీంతో ఆర్కే బీచ్ అంతటా హైఅలెర్ట్ నెలకొనివుంది. నిత్యం కెరటాల హోరుతో ప్రతిధ్వనించే విశాఖలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనికంతటికి కారణం... ప్రత్యేక హోదా డిమాండ్‌తో యువత తలపెట్టిన మౌన ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు సర్వం సిద్ధంగా ఉన్నాయి. దీంతో గతంలో ఎన్నడూ కనిపించని ఉద్రిక్తత వాతావరణం నెలకొనివుంది
విద్యార్థులు, యువతులు నిర్వహించినున్న ఈ మౌనప్రదర్శనకు అధికార టీడీపీ, బీజేపీలు మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అందులో స్వయంగా పాల్గొంటానని వైసీపీ అధినేత జగన స్పష్టం చేశారు. వీటన్నిటి నేపథ్యంలో గురువారం.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముందు జాగ్రత్తచర్యగా పోలీసు బలగాలన్నీ బుధవారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైనే బందోబస్తు చేపట్టాయి.
ఈ మౌనప్రదర్శనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ విశాఖపట్నం వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నుంచి విశాఖ వైపు వచ్చే దారులపై బుధవారం రాత్రి నుంచి ఆయా జిల్లాల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.