వీటిపై శ్యామ్ కిశోర్ స్పందిస్తూ... పన్నుల వాటా పెంచి, జీఎస్టీ అమలు చేసిన తర్వాత ప్రత్యేక హోదాతో నష్టమేనని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు వంత పాడుతున్నారని ఆక్షేపించారు.
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం కంటే కేంద్రం ఎక్కువగా నిధులు, పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు చేస్తూ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోందన్నారు. హోదాతో వచ్చే లాభం కన్నా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తూ అభివృద్ధికి తోడ్పడుతోందని చెప్పారు.