సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషించినా ,క్రిమినల్ పేర్లను సంబోదిస్తూ వ్రాసినా కూడా కేసులు నమోదుచేస్తామని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఒక వ్యక్తి గురించి కించపర్చుతూ వ్యాఖ్యలు చేసి తొలిగించినా కేసులు నమోదు చేస్తామని, తమ దగ్గర ఐటీ టెక్నాలజీ ఉందని దీనివలన తొలిగించిన మెసేజ్ లను కూడా పరిగణంలోనికి తీసుకుని కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
వాట్సప్ గ్రూపులలో కూడా నిరాధారమైన వార్తలు వ్రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని డిజీపీ గౌతం సవాంగ్ అన్నారు.వాట్సప్ గ్రూపులలో వ్యక్తి గత దూషణలు చేస్తూ సంభాషించినా, దుర్బషలాడినా గ్రూప్ అడ్మిన్ తో పాటు గ్రూప్ సభ్యుల మీద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.