ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 7729 పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. టీఆర్‌టీ, టెట్ కమ్ టీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించి, నియామక ప్రక్రియ చేపడతారు. రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,729 టీచర్ పోస్టులను జిల్లా సెలెక్షన్ కమిటీ(డీఎస్సీ)ల ద్వారా భర్తీచేసేందుకు వీలుగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచారు. ఓసీ అభ్యర్థులకు 42 నుంచి 44 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 నుంచి 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 52 నుంచి 54 సంవత్సరాలకు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో డీఎస్సీ-2018 షెడ్యూల్‌ను విడుదల చేశారు.
డీఎస్సీ షెడ్యూల్ వివరాలు
అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల
నవంబరు 1 నుంచి 15 వరకూ ఫీజు చెల్లింపు
నవంబరు 1 నుంచి 16 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
నవంబరు 1 నుంచి 12 వరకూ హెల్ప్‌డెస్క్ సర్వీసులు
నవంబరు19 నుంచి 24 వరకూ పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబరు 17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టులు
నవంబరు 29 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్
డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజెస్) రాత పరీక్షలు
11న స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) రాత పరీక్షలు