ట్యాబ్లెట్స్ ఓపెన్ చేస్తే అశ్లీల చిత్రాలు... వామ్మో అంటూ బెదిరిపోతున్న టీచర్లు...

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:29 IST)
టెక్నాలజీని సరిగా ఉపయోగించుకోకుంటే పలు అనార్థాలకు దారితీస్తుంది. అదే ఛత్తీస్‌గర్ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఓపెన్ చేయగానే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన మహిళా టీచర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు కోసం గత సంవత్సరం ట్యాబ్లెట్స్ సరఫరా చేసింది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అయితే, రాయ్‌పూర్ జిల్లాలోని ఓ టీచర్ వీటి ద్వారా పోర్న్‌సైట్లను వీక్షించాడు. 
 
ఇక్కడ నుంచే అసలు సమస్య ఉత్పన్నమైంది. సదరు సైట్లను ఓపెన్ చేయడంతో వాటిలోని వైరస్ అన్ని ట్యాబ్లెట్లకు సోకింది. ఈ విషయం తెలియని ఇతర ఉపాధ్యాయులు ట్యాబ్లెట్స్‌ను ఓపెన్ చేయగానే అశ్లీల చిత్రాల పాప్అప్స్ రావడం మొదలుపెట్టాయి. 
 
ఈ అశ్లీల చిత్రాల నేపథ్యంలో ట్యాబ్లెట్లను వినియోగించేందుకు మహిళా టీచర్లు నిరాకరిస్తున్నారు. కనీసం బయోమెట్రిక్ ఇచ్చేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించేవరకూ ఈ ట్యాబ్లెట్స్‌ను వాడొద్దని రాయ్‌పూర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు