కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ చంపేశారు : ఆర్థిక మంత్రి పయ్యావుల

ఠాగూర్

సోమవారం, 30 డిశెంబరు 2024 (13:08 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ల వ్యవస్థను చంపేశారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్నిఇచ్చేది కాంట్రాక్టర్లేనని ఆయన గుర్తు చేశారు. 
 
గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోచేస్తే, తమ ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్టు పయ్యావుల తెలిపారు. 
 
ప్రాధాన్యత ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. త్వరలో కార్పొరేషన్లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామన్నారు. వైసీపీ సర్కారు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల మేర అప్పు ఉందని, ప్రతి నిమిషానికి పరిస్థితులు అంచనా వేసుకుని జాగ్రత్తగా పాలన చేయాల్సి వస్తోందని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు