ఈ క్రమంలో ఆనందయ్య మందును పంపిణీ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ, కరోనా కోసం తాము తయారు చేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు.
ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో... ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఆ సంఖ్యకు అనుగుణంగా మందును తయారు చేస్తామని ఆనందయ్య వెల్లడించారు.