12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? ఏపీని నిలదీసిన సుప్రీం

మంగళవారం, 22 జూన్ 2021 (18:39 IST)
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా 12వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. 
 
రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో, ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
 
పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని... ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీని ఎందుకు మినహాయించాలని వ్యాఖ్యానించింది. 
 
ముఖ్యంగా, 12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? చెప్పాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి. సెప్టెంబరులో 11వ తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెల్సిందే. అలాగే, కేంద్రం కూడా ఈ యేడాది  సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. కానీ, ఏపీ మాత్రం పరీక్షలను నిర్వహించితీరుతామని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు