అంతేకాదు ఇక.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. దీంతో ఇకపై, జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.