బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమాలో శ్రీవల్లిగా మెప్పించింది.
ఇక ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పాట అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయానని పేర్కొంది. కానీ మొదట్లో కాస్త భయంగా, అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించింది.