కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందిచాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. ఆయన ఆలోచన వెనుక క్రైస్తవం ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆరచించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
అదేసమంలో కులమతాలు వేర్వేరని, ఎవరి విశ్వాసాల ప్రకారం వారు నడుచుకుంటారని, ఎవరి విశ్వాసం మేరకు వారు మార్చొచ్చని తెలిపారు. అందేసమయంలో సీఎం జగన్కు క్రైస్తవ మతాన్ని పాటించండం వల్లే ఆయన ఐదుగురు దళితులకు మంత్రిపదవులు ఇచ్చారని హోం మంత్రి సుచరిత అన్నారు.