హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించిన హోం మంత్రి మేకతోటి సుచరిత

శుక్రవారం, 19 నవంబరు 2021 (15:35 IST)
వృద్ధులకు,అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు మంచి ఆహ్లాదకర వాతావరణంలో  హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు నిమ్మకాయల సత్యనారాయణ, యడ్డపల్లి శ్రీ కృష్ణ, నడింపల్లి విజయప్రసాద్ లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. ఈ  ఉదయం గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఓల్డ్ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత ప్రారంభించారు. 
 
 
ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, భారతదేశంలో దాదాపు 15 కోట్ల మంది వృద్ధులు ఉన్నారని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలు పతనం అవుతున్న సందర్భంలో వృద్ధులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పరిసరాలతో కూడిన వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం నేటి సమాజానికి చాలా అవసరమన్నారు. ఉద్యోగాల రీత్యా తమ బిడ్డలు విదేశాలలో ఉన్న సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు ఆశ్రమిస్తున్నాయి అన్నారు.                      

 
ఈ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ, హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించడం ద్వారా వృద్ధులకు మంచి ఆశ్రయాన్ని కల్పిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి, ఆరోగ్య సేవలను సైతం అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.       

 
మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ సమాజహితం కోరే దాతృత్వం గల మహనీయులు ముందుకు వచ్చి మరిన్ని వృద్ధాశ్రమాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 61 లక్షల మంది వృద్ధులకు ప్రతినెల 2,500 రూపాయల చొప్పున అందించడం హర్షణీయమన్నారు.


ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ ట్రస్ట్ మెంబర్ బూసి రెడ్డి మల్లేశ్వర్ రెడ్డి,అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపక చైర్మన్ నిమ్మకాయల సత్యనారాయణ, కోశాధికారి యడ్లపల్లి శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు నడింపల్లి విజయ ప్రసాద్, మేనేజర్ యన్ జ్యోతి, సీనియర్ జర్నలిస్ట్ యన్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు